-->

మితిమీరిన వేగం.. చెట్టును ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి

మితిమీరిన వేగం.. చెట్టును ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి


మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ప్రమాదం మహారాష్ట్రలోని సోలాపూర్–పుణె జాతీయ రహదారిపై మొహోల్ సమీపంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళను మొహోల్‌లోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

పన్వెల్ నుంచి అక్కల్‌కోట్‌కు దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793