-->

ఖమ్మం రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

 
ఖమ్మం రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో సుమారు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్నేరు–పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేయగా, కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, అలాగే నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఏదులాపురం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నర్సింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు

నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు భారీ డిమాండ్ ఉందని, భాషే ప్రధాన అడ్డంకిగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జపనీస్, జర్మన్ భాషల బోధన కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుందని, త్వరలోనే నర్సింగ్ కాలేజీలకు ఆయా భాషల ఉపాధ్యాయులను పంపుతామని వెల్లడించారు.

విద్య–వైద్యానికి అధిక ప్రాధాన్యం

ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నర్సింగ్ వృత్తి సేవాభావంతో కూడుకున్నదని, నిరుపేదలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. నర్సింగ్ విద్యార్థులు వృత్తిలో రాణించి దేశ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు.

బహిరంగ సభలో కీలక ప్రకటనలు

అనంతరం మద్దులపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రేషన్ కార్డు లేని అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే అయోధ్య రామమందిరాన్ని తలపించే విధంగా భద్రాచలం శ్రీరామ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793