-->

తెలుగువారి భవిష్యత్తుపై చర్చ జాతీయ రాజకీయాల్లో పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలుగువారి భవిష్యత్తుపై చర్చ జాతీయ రాజకీయాల్లో పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు


జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గిపోతున్నదని, ఇది ఆందోళన కలిగించే విషయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) నిర్వహించిన 12వ ద్వైవార్షిక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష, సంప్రదాయాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

ముఖ్యమాత్రి ప్రసంగం ప్రధానాంశాలు:

తెలుగు భాష గొప్పతనంపై గుర్తు:

హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. మన భాషను, సంస్కృతిని కోల్పోకుండా కాపాడుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని చెప్పారు.

భారత రాజకీయాల్లో తెలుగువారి విజయాలు:

గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని గుర్తుచేశారు.

తెలుగు భాషకు గౌరవం:

జీవోలను తెలుగులో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. న్యాయస్థాన తీర్పులనూ తెలుగులో అందించగలిగితే సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి:

హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు. 2050 అభివృద్ధి ప్రణాళికతో తెలంగాణను ప్రపంచంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు.

పెట్టుబడులకు పిలుపు:

విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సదస్సు విశేషాలు:

ఈ సమావేశంలో “తెలుగుదనం – తెలుగుధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

తెలుగువారి ఉనికి, భవిష్యత్తు, అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అన్ని రంగాల్లో తెలుగువారి విజయాలు కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793