-->

వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు

వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి అధికమైంది. ప్రతి ఇంట్లో ఒక్కరైనా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కొందరికి గొంతు ఇన్ఫెక్షన్ ఇబ్బందిని కలిగిస్తోంది. వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా వృద్ధుల్లో కొందరు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు.

ఇలాంటి సమయంలో చైనాలో విజృంభిస్తున్న HMPA వైరస్ లక్షణాలు కూడా ఇలాగే ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

30 శాతం పెరిగిన రోగుల సంఖ్య

ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. డాక్టర్లు చెబుతున్న ప్రకారం, శ్వాసకోశ వ్యాధుల రోగుల సంఖ్య 30% వరకు పెరిగింది. సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నా, తీవ్రమైన సమస్యలుంటే డాక్టర్లను సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా సమయంలో పాటించిన గైడ్‌లైన్స్‌ను ఇప్పుడు కూడా అనుసరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఆరోగ్యశాఖ చర్యలు

సర్వ జనాభాకు మెడిసిన్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలకు మెడిసిన్స్ తక్షణమే అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.

యాంటీబయాటిక్స్ వాడకూడదు

జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యలకు యాంటీబయాటిక్స్ వాడకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఫ్లూ ఐతే కొన్ని రోజుల్లో తగ్గుతుంది. డాక్టర్ల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలని చెప్పారు.

పరీక్షలు:

చల్లని ఆహారం మానుకుని వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

ఇబ్బంది ఉన్న వ్యక్తులతో కరచాలనం చేయరాదు.

వారి వస్తువులను ఉపయోగించవద్దు.

చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు.

జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793