-->

బీసీ కమిషన్ నోటిఫికేషన్: కులసంఘాల విజ్ఞప్తి మేరకు మార్పులు

బీసీ కమిషన్ నోటిఫికేషన్: కులసంఘాల విజ్ఞప్తి మేరకు మార్పులు

ఎనిమిది కులాల పేర్లలో మార్పులు..!!

అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 18 వరకు గడువు

హైదరాబాద్: తమ కులాల పేర్లను చులకనగా చూస్తూ, తిట్లకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని కులసంఘాల విజ్ఞప్తుల మేరకు బీసీ కమిషన్ చర్యలు తీసుకుంది. జిల్లాల్లో బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చినట్లు సమాచారం.

ఈ వినతుల్లో ప్రధానంగా దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి అనే కులాల పేర్లను మార్పు చేయాలని సూచనలు వచ్చాయి. ఆయా కులసంఘాల ప్రతినిధులు కొత్త పేర్లను కూడా కమిషన్‌కు సూచించారు.

ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్పు చేసిన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18లోపు ఖైరతాబాదు బీసీ కమిషన్ ఆఫీసులో సంప్రదించాలని కమిషన్ మెంబర్ సెక్రటరీ మరియు బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయ దేవి పేర్కొన్నారు.

సమాజంలో గౌరవం కాపాడేందుకు కులసంఘాల విజ్ఞప్తి

తమ కులపేర్లను వ్యతిరేక ప్రయోజనాలకు, తిట్లకు ఉపయోగించడం వలన కలిగిన ఆవేదనను కులసంఘాలు బీసీ కమిషన్ ముందు ఉంచాయి. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించి, మార్పులను చేపట్టింది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793