సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం
హైదరాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సమయంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
అయితే, సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో మాత్రం సాధారణ టికెట్ ధరపై 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వివరించింది. రోజువారీ బస్సుల్లో అయితే అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టంగా ప్రకటించింది.
ఈ ప్రత్యేక బస్సులపై రద్దీని తగ్గించేందుకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Post a Comment