-->

చైనా మాంజల విక్రయంపై పోలీసులు ప్రత్యేక దాడులు

  

చైనా మాంజల విక్రయంపై పోలీసులు ప్రత్యేక దాడులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఆదేశాల మేరకు, కొత్తగూడెం పట్టణంలో నిషేధిత చైనా మాంజల విక్రయంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈరోజు కొత్తగూడెం 3 టౌన్ సీఐ K. శివ ప్రసాద్, SI లు B. పురుషోత్తం, G. మస్తాన్ లు సిబ్బందితో కలిసి చిన్న బజార్, పెద్ద బజార్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

దీని ఫలితంగా పెద్దబజార్ లోని పవన్ టైయర్స్ షాప్ లో 5-30 మాంజా బండిల్స్, 10 థ్రెడ్ రోల్స్ మరియు పవన్ జనరల్ మర్చంట్స్ షాప్ నుండి 14 బండిల్స్ ను గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన మాంజల మొత్తం విలువ రూ.9100/- గా అంచనా వేయబడింది. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

నిందితుల వివరాలు:

1. కండేవాల పవన్, తండ్రి: ప్రభుదాయల్, వయస్సు: 35 సంవత్సరాలు, నివాసం: పెద్దబజార్, కొత్తగూడెం.

2. బ్రిజే కిషోర్ సాహు, తండ్రి: రామనాద్ సాహు, వయస్సు: 60 సంవత్సరాలు, నివాసం: పెద్దబజార్, కొత్తగూడెం.

ప్రమాదకరమైన చైనా మాంజపై ప్రభుత్వం నిషేధం:

ప్రజల ప్రాణాలకు, వాహనదారులకు, పక్షుల జీవనానికి ప్రమాదకరమైన చైనా మాంజపై ప్రభుత్వం నిషేధం విధించింది. చట్టాన్ని ఉల్లంఘించి వీటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793