వెలిచాలలో ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు
కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బీఎస్పీ నాయకులు జిల్లా ఇన్చార్జి కల్లెపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై, సావిత్రీబాయి ఫూలే యొక్క కృషి, సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సోదరి, సోదరులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
చలిని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో హాజరైన ముదిరాజ్ కులస్తుల సంయుక్త కృషితో ఈ వేడుక విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా "జై భీమ్" నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని నాయకులు గుర్తుచేశారు.

Post a Comment