ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం పురుడు పోసిన తోటి మహిళలు
గద్వాల్ జిల్లా: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మరియమ్మ అనే మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించారు. బస్సును రోడ్డు పక్కన నిలిపి, సమయం ఆలస్యమవ్వకుండా మహిళల సహకారంతో మరియమ్మకు బస్సులోనే ప్రసవం జరిపించారు.
ఈ సంఘటన గద్వాల్ జిల్లా నందిన్నే గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రసవం విజయవంతంగా పూర్తవ్వడంతో తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది 108 అంబులెన్స్ సాయంతో వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. 2024 జులైలో కూడా ఒక గర్భిణి పురిటి నొప్పులతో బాధపడగా, ఆర్టీసీ కండక్టర్ మరియు తోటి మహిళా ప్రయాణికుల సహకారంతో ప్రసవం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా స్పందించి ప్రసవంలో సహాయం చేసిన వారికి అభినందనలు తెలిపారు.
ఈ తరహా సంఘటనలు మహిళా సంఘీభావానికి ఒక చిహ్నంగా నిలుస్తున్నాయి.

Post a Comment