RG3 OC CHPలో డస్ట్ వలన కార్మికులకు ప్రమాదం పొంచి ఉంది
రామగుండం 3 ఏరియా ఓపెన్ కాస్ట్-1 (RG 3 OC 1) లో కోల్ డస్ట్ సమస్య తీవ్రంగా మారింది. CHP (Coal Handling Plant)లో ఏర్పడుతున్న పెనుదుమ్ము కార్మికుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుండగా, అధికారులు దీన్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. గెలిచిన కార్మిక సంఘాలు కూడా స్పందించకపోవడంతో HMS (Hind Mazdoor Sabha) ఈ సమస్యపై కార్యాచరణ ప్రారంభించింది.
ఈరోజు HMS నాయకులు CHP OC 1 కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటర్ స్ప్రేయింగ్ తప్పనిసరి అని పేర్కొన్నారు. లోపల నుండి వచ్చే బొగ్గును తడిపి తీసుకురావాలని ప్రాజెక్ట్ ఆఫీసర్‌కి HMS నాయకులు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, CSP, BWS, సైట్ ఆఫీస్‌లలోని కార్మికుల సమస్యల గురించి ప్రాజెక్ట్ ఆఫీసర్, మేనేజర్‌లతో HMS ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రధానంగా దుమ్ము సమస్యను తక్షణమే పరిష్కరించాలని, మహిళా కార్మికుల సమస్యలపై నిర్వాహక లోపాలను అధికారులను నిలదీశారు. చర్చల అనంతరం, స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి అంగీకరించారు.
ఈ కార్యక్రమంలో HMS జాతీయ సంఘం నాయకులు గోషిక అశోక్, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, కొమ్ము మదనయ్య, సత్యనారాయణ, క్రాంతి కిరణ్, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రతపై అధికారుల తీరును HMS నేతలు తీవ్రంగా విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత విభాగాలు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Post a Comment