-->

భూ భారతిలో అప్లై చేసుకోవడం ఎలా?

భూ భారతిలో అప్లై చేసుకోవడం ఎలా?


1. వీలునామా / వారసత్వం ఆధారంగా మ్యుటేషన్:

  • ఎక్కడ అప్లై చేయాలి?
    భూభారతి పోర్టల్‌లో తహసీల్దార్‌కు దరఖాస్తు చేయాలి.

  • ఏం జత చేయాలి?

    • వీలునామా లేదా వారసత్వ ఆధారాల డాక్యుమెంట్లు
    • ఇంటెస్టేట్ వారసత్వం అయితే – వారసులందరి నుంచి జాయింట్ అఫిడవిట్
    • సర్వే / సబ్‌డివిజన్ మ్యాప్
  • ప్రాసెస్ ఎలా ఉంటుంది?

    • తహసీల్దార్ నోటీసులు జారీ చేసి, గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయంలో ప్రకటన వేస్తారు
    • 7 రోజుల్లో ఆధారాలతో అఫిడవిట్ సమర్పించాలి
    • ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేస్తారు
    • 30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ వస్తుంది
    • ఆర్డర్ రాకపోతే – దరఖాస్తుదారు పేరు డీమ్డ్ మ్యుటేషన్‌గా పరిగణిస్తారు
    • ఆమోదమైతే – కొత్త / అప్‌డేట్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ వస్తుంది

2. రికార్డుల్లో సవరణ చేయించుకోవడం:

  • ఎప్పుడు అప్లై చేయాలి?

    • చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపల
    • లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపల
  • ఏం జత చేయాలి?

    • పట్టాదార్ పాస్‌బుక్
    • టైటిల్ డీడ్
    • పహాణీ
    • రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు
    • అఫిడవిట్
  • ప్రాసెస్ ఎలా ఉంటుంది?

    • సంబంధిత అధికారులు – దరఖాస్తుదారుకూ, రికార్డుల్లో ఉన్న వ్యక్తులకూ, ఇతర హక్కుదారులకూ నోటీసులు ఇస్తారు
    • 7 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి
    • అభ్యంతరాలు లేకపోతే, ఆధారాలపై నిర్ణయం తీసుకుంటారు
    • ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేయొచ్చు
    • 60 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు
    • ఆర్డర్‌ను పోర్టల్‌లో చూపించి, పార్టీలకు తెలియజేస్తారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793