-->

ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బియ్యం పంపిణీ

ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బియ్యం పంపిణీ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి జి. భానుమతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

కొత్తగూడెం: లీగల్ న్యూస్: కొత్తగూడెంలో ట్రాన్స్‌జెండర్ మరియు సెక్స్ వర్కర్లకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం సోమవారం జరగింది. ఈ సేవా కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న న్యాయమూర్తి గౌరవనీయ జి. భానుమతి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి గారు ట్రాన్స్‌జెండర్లు మరియు సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి అవసరాలు, సమస్యలపై చర్చిస్తూ, ప్రభుత్వ, న్యాయ సేవా సంస్థల సాయంతో వారికి సహాయం అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు, కొత్తగూడెంలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ మరియు సెక్స్ వర్కర్లకు ఉచిత బియ్యం పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమం అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి నెల కూడా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిరంతరంగా విజయవంతంగా నిర్వహించేందుకు సెక్యూర్ ఎన్.జి.ఓ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేంద్రప్రసాద్‌కి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, సెక్యూర్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలలోని పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు న్యాయపరమైన, సామాజిక సహాయాన్ని అందించడంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793