జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పిలుపు
ఈ సమావేశంలో పాటిల్ వసంత్ మాట్లాడుతూ, రాజీ సాధనకు అనుకూలమైన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఇ-పిటీ కేసుల వివరాలను ప్రతి పోలీస్ స్టేషన్ నుండి సేకరించాల్సిందిగా ఆదేశించారు. జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి పోలీసులు, న్యాయవాదులు, ఇతర అధికారులు కలిసి పనిచేయాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా జిల్లాను రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిపేలా చూస్తామని తెలిపారు.
ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు తమ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కోరుతూ, ముఖ్యంగా మోటార్ వాహన ప్రమాద బాధితులకు త్వరిత న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా రాజీపడే కేసులలో కక్షిదారులకు సమయం, ధనం దౌర్భాగ్యం తప్పుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రిమినల్, సివిల్, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంకు, టెలిఫోన్, సైబర్ క్రైమ్ వంటి కేసుల పరిష్కారానికి ఇది అనుకూలమైన అవకాశం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సాయి శ్రీ, స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, భార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఊట్కూరు పురుషోత్తమరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీవీడీ లక్ష్మి, ఇతర ఏ పీపీలు, పోలీసు అధికారులు సీఐడీ సీఆర్‌బీ, టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ రమేష్ కుమార్, జూలూరుపాడు ఎస్‌హెచ్‌ఓ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సీనియర్ న్యాయవాదులు గాదె రామచంద్ర రెడ్డి, ఎస్‌వి రామారావు, అంబటి రమేష్, వేముల మధుకర్, కోర్ట్ కానిస్టేబుల్స్, లైజాన్ ఆఫీసర్స్ అబ్దుల్ ఘని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సందేశం: ప్రజలు ఈ లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని తమ కేసులను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశం పొందవచ్చని న్యాయ సేవాధికారులు తెలిపారు.
Post a Comment