-->

MP గడ్డం వంశీకి సరస్వతి పుష్కర ఆహ్వానం రాకపోవడం బాధాకరం – మాల మహానాడు

MP గడ్డం వంశీకి సరస్వతి పుష్కర ఆహ్వానం రాకపోవడం బాధాకరం – మాల మహానాడు


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల ప్రారంభమైన కాలేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకి ఆహ్వానం అందకపోవడం దురదృష్టకరమని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్ మీడియాతో మాట్లాడుతూ, "స్థానిక ఎంపీ అయిన గడ్డం వంశీ గారికి ఆహ్వానం ఇవ్వకపోవడం అవమానకర విషయం. ఇది కేవలం వ్యక్తిగతంగా ఎంపీకి మాత్రమే కాకుండా, దళిత సమాజానికే అవమానంగా భావిస్తున్నాం," అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రోటోకాల్‌కు మంచి అవగాహన ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందినప్పటికీ, ఎంపీ గారిని పూర్తిగా విస్మరించినట్టు కనిపించడాన్ని తాము తీవ్రంగా విమర్శిస్తున్నామని చెప్పారు.

అలాగే, ఈ వ్యవహారానికి దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ IAS, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు బాధ్యత వహించాలని, గడ్డం వంశీ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"దళిత ఎంపీ అయినందునే గడ్డం వంశీ గారిని ఈ విధంగా నిర్లక్ష్యం చేశారని మేము భావిస్తున్నాం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం," అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాల మహానాడు సంస్థ నేతలైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడ్ల పరంజ్యోతి రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతోటి కాంతయ్య, బండి అశోక్, రాష్ట్ర కార్యదర్శి బేగరి శివరాజు, దాసరి దేవయ్య, ఉపాధ్యక్షులు కామర్ల జానయ్య, అన్నంపల్లి ఎల్లన్న, ఇతర జిల్లా బాధ్యులు బోయిల అఖిల్, దండు రాజు, దేవి దాసు, నీలగిరి రాజు, కట్ట దుర్గాప్రసాద్, గుంతెటి వీరభద్రం, పల్లా రాజశేఖర్, గుమ్మడి కనకరాజు, ముల్లగిరి కాంతయ్య, సామరాజు, మన్నే కృష్ణయ్య తదితరులు ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.