మిస్ వరల్డ్ 2025 వివాదం పై తీవ్ర స్థాయిలో BRS నేత బానోత్ పుష్పలత స్పందన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింది
మణుగూరులో మిస్ వరల్డ్ 2025 పోటీపై ఏర్పడిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంలో BRS పార్టీ మణుగూరు టౌన్ సోషల్ మీడియా అధ్యక్షురాలు బానోత్ పుష్పలత మీడియాతో మాట్లాడుతూ, మిస్ వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీకి జరిగిన అన్యాయం ప్రతి తెలంగాణ పౌరుని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి మచ్చ వేసిన ఘటన," అని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపును నాశనం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళల భద్రతను, ప్రజల గౌరవాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమైందని ఆమె ధ్వజమెత్తారు.
పుష్పలత పేర్కొన్నట్లుగా, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మిల్లా మాగీకి న్యాయం జరగాలని, ఆమె గౌరవాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
"మేము BRS పార్టీ తరఫున ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజల గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి పోరాటం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేగ," అంటూ పుష్పలత వ్యాఖ్యలు ముగించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచుతుండగా, అధికార పార్టీ నుండి దీనిపై ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి.
Post a Comment