జర్నలిస్ట్ మునీర్ సాబ్ ఇక లేరు... విలాపన జలపాతంగా మారిన మీడియా వర్గాలు..!
తెలంగాణ ఉద్యమం రోజుల నుండి స్వరాష్ట్ర సాధన కోసం తన కలాన్ని ఆయుధంగా మలుచుకొని పోరాడిన ఓ గొప్ప జర్నలిస్టు… చీకటిలో వెలుగు నింపిన గొంతుక… వాస్తవాన్ని ధైర్యంగా ప్రజల ముందుంచిన విలేఖరి మునీర్ సాబ్ ఇక లేరు. ఈ వార్తను వినగానే తెలుగు మీడియా వర్గాలు, ఉద్యమకారులు, సామాన్య ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
సింగరేణి ప్రాంతాల్లో కార్మికుల హక్కుల కోసం గళమెత్తిన ఈ మేధావి, అన్యాయాలను బహిర్గతం చేసిన ధైర్యవంతుడు. ఆయన రాసిన ప్రతి వార్త ఓ సామాజిక మార్పుకు నాంది పలికింది. ప్రజల జీవన పరిస్థితుల్ని తన కలంతో ప్రతిబింబించిన మునీర్, నిజాయితీకి మారుపేరు.
దేశ రక్షణలో సైనికులు ఎంత ముఖ్యమో, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు అంతే కీలకం. సైనికులు తుపాకులతో శత్రువులను ఎదుర్కొంటే, జర్నలిస్టులు ప్రశ్నల తూటాలతో అసత్యాన్ని ఎదిరిస్తారు. ఆ దారిలో మునీర్ ముందుంటూ సాగారు.
"మరణం శరీరానికే, ఆలోచనలకూ, ఆదర్శాలకూ కాదు" అనే మాటను నిజం చేస్తూ, మునీర్ సాబ్ లాంటి మహనీయుడు గుండె ఆగిపోయినా, ఆయన గొంతుకల మారుమ్రోగులు మార్పు కోసం పోరాడుతున్న ప్రతి గొంతులో నిలిచిపోతాయి.
చరిత్ర పుటల్లో ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. తరం తరాలకు స్ఫూర్తిగా నిలిచే ఈ విలక్షణ జర్నలిస్టుకు శ్రద్ధాంజలిగా...
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
Post a Comment