గౌడ సంఘ భవనం నిర్మాణానికి పూర్తి మద్దతు: టీపీసీసీ అధ్యక్షులు
హైదరాబాద్, గాంధీ భవన్: ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ సంఘం భవనం నిర్మాణానికి అవసరమైన నిధుల విషయమై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను గౌడ సంఘం నేతలు, కులస్తులు మరియు బీసీ నాయకులు కలిసి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మాట్లాడుతూ, “గౌడ్ గా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. గౌడ్స్ రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉంది,” అని పేర్కొన్నారు. గౌడ సంఘ భవనం భవిష్యత్ తరాల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
భవనం నిర్మాణం కోసం నిధుల సాధనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి చర్చిస్తానని, కావాల్సిన సహాయాన్ని అందిస్తానని టీపీసీసీ అధ్యక్షులు హామీ ఇచ్చారు.
ప్రధాన హైలైట్స్:
- గౌడలు, బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం
- రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కుల గణనను పారదర్శకంగా పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు
- కుల సర్వే ప్రకారం బీసీల శాతం 56గా తేలింది
- బీసీలకు సమగ్ర సామాజిక న్యాయం సాధించగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే
- వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన Mahesh గౌడ్
- తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి విజయాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాధ్యం అయ్యాయన్న టీపీసీసీ చీఫ్
- కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కుల గణన చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయానికి నిదర్శనం
గౌడ సంఘం నాయకులు టీపీసీసీ అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు. భవనం నిర్మాణానికి ఆయన అందిస్తున్న సహకారం గౌడ సంఘ అభివృద్ధికి మేలుకలగాలని వారు ఆకాంక్షించారు.
Post a Comment