-->

ఫార్మసీస్ట్ నుండి ఫార్మసీ ఆఫీసర్లుగా పేరు మార్పు చేసినందుకు ఘనంగా వేడుకలు

 

ఫార్మసీస్ట్ నుండి ఫార్మసీ ఆఫీసర్లుగా పేరు మార్పు చేసినందుకు ఘనంగా వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం, మే 15, 2025: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో Pharmacy Officers గా పేరు మార్పు చేసిన  సందర్భంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ నాయక్, DCHS డాక్టర్ రవిబాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ జయలక్ష్మి, భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ చైతన్య, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మధు, వరుణ్, తేజశ్రీ, మరియు AO సృకృత, డిప్యుటీ డెమో ఫయాజ్, సూపరిడెంటెంట్ సుదర్శన్ పాల్గొన్నారు.

 Pharmacy Officers గా పేరు మార్పు చేదినందున  అధికారులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని ఆనందంగా ఈ సందర్భాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు Telangana Government Pharmacy Officers Association – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ ఉత్సవానికి జిల్లా అధ్యక్షులు ఎల్. రామచందర్, వేణుమాధవ్, నరసింహారావు, సౌమ్య, మురళీమోహన్, లక్ష్మీ, పద్మ, శ్రీలక్ష్మీ, రవీంద్ర, రాజ్ కుమార్, అజయ్, తులసిరామ్, శశికళ, సునీల్, పావని, కరుణాకర్, అనిల్, మధు, ప్రసాద్, తులసి  మరియు ఇతర ఫార్మసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విచ్చేసిన అధికారులకు మరియు Pharmacy Officers మిత్రులకు జిల్లా తరఫున ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793