-->

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన కొత్త మంత్రులు, మాదిగ ప్రజాప్రతినిధులు

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన కొత్త మంత్రులు, మాదిగ ప్రజాప్రతినిధులు


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్‌లోని ఆయన అధికార నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి గారిని కలుసుకొని తమ నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ, మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రివర్గంలో తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అభినందిస్తూ, తమ వర్గ అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మెచ్చుకున్నారు.

ఈ సమావేశంలో పలువురు మాదిగ సంఘాల నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మాదిగ వర్గాన్ని పాలక వ్యవస్థలో సరైన స్థానం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793