-->

రహమత్ హుస్సేన్ ను ఘనంగా సన్మానించిన సంచార ముస్లింలు

రహమత్ హుస్సేన్ ను ఘనంగా సన్మానించిన సంచార ముస్లింలు


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇటీవలే నియమితులైన సీనియర్ మైనారిటీ నాయకుడు రహమత్ హుస్సేన్ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు పర్యటనకు రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

కరీంనగర్ ఐబీ గెస్ట్ హౌస్‌ లో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.డి. షబ్బీర్, రాష్ట్ర కోశాధికారి ఎం.డి. షాదుల్లా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. దావూద్, జిల్లా సెక్రటరీ ఎం.డి. రియాజ్, జాయింట్ సెక్రటరీ ఫరూక్, అంకుస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం రహమత్ హుస్సేన్ గారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. పార్టీకి ఆయన మద్దతు మైనారిటీ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ముస్లిం మైనారిటీల పాత్ర ఎంతో కీలకమని, అన్ని వర్గాల అభివృద్ధికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793