నాగా సీతారాములు కి ఘన సన్మానం – మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్ష
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన నాగా సీతారాములు గారికి ఘనంగా సన్మానం జరిగింది. కొత్తగూడెం సహకార సంఘం చైర్మన్ మండే వీర హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను శాలువాతో ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వీర హనుమంతరావు మాట్లాడుతూ – "గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పనిచేస్తున్న నాగా సీతారాములు గారి సేవలను గుర్తించి, పార్టీ అధిష్టానం అతనికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవిని కల్పించడం అభినందనీయమైంది" అన్నారు.
అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఈ ఎంపిక బీసీ వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు.
నాయకుడిగా సీతారాములు నియోజకవర్గంలోనే కాక, జిల్లా స్థాయిలో కూడా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అతని నిబద్ధత పార్టీ శ్రేణులకే కాదు, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయనకు త్వరలోనే మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మత్స్య శాఖ అధ్యక్షులు బానోత్ సూర్యం, భక్తుల రమేష్, కార్యదర్శి పిట్టల సాయిలు, మాజీ అధ్యక్షుడు లింగం లక్ష్మయ్య, డైరెక్టర్ బానోతు మున్న, కోఆప్షన్ సభ్యులు ఎట్టి భాస్కర్ రావు, గౌరవ సభ్యులు అజ్మీర, అమ్రు భూక్య లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు బత్తుల రమేష్, దండు కృష్ణయ్య, వడుగు నరసింహారావు, మల్లిపెద్ది నాగరాజు, చల్ల వెంకటేష్, కోమారి రవీందర్, చేతుల మహేష్, గుగులోతు కోటేష్, భూక్య సంతోష్ తదితరులు కూడా నాగా సీతారాములును ఘనంగా సన్మానించారు.

Post a Comment