-->

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల షురూ: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్న శరన్నవరాత్రులు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల షురూ: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్న శరన్నవరాత్రులు


విజయవాడ: దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఈ మేరకు ఆలయ అధికారుల సమక్షంలో వైదిక కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ 11 రోజులపాటు ప్రతిరోజూ అమ్మవారిని భిన్నమైన రూపాల్లో అలంకరించనున్నారు. అలాగే ప్రతిరోజూ నగరోత్సవాలు, విశిష్ట పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

దసరా ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టంగా సెప్టెంబర్ 29వ తేదీ మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా కాత్యాయని దేవి అలంకరణ దర్శనానికి సిద్ధం చేస్తున్నారు.

ప్రతి రోజు అలంకరణలు ఇలా:

  • సెప్టెంబర్ 22 – బాలా త్రిపురసుందరీ దేవి
  • సెప్టెంబర్ 23 – గాయత్రీ దేవి
  • సెప్టెంబర్ 24 – అన్నపూర్ణా దేవి
  • సెప్టెంబర్ 25 – కాత్యాయని దేవి
  • సెప్టెంబర్ 26 – మహాలక్ష్మీ దేవి
  • సెప్టెంబర్ 27 – లలితా త్రిపురసుందరీ దేవి
  • సెప్టెంబర్ 28 – మహాచండీ దేవి
  • సెప్టెంబర్ 29 – సరస్వతీ దేవి
  • సెప్టెంబర్ 30 – దుర్గాదేవి
  • అక్టోబర్ 1 – మహిషాసురమర్ధినీ దేవి
  • అక్టోబర్ 2 – రాజరాజేశ్వరీ దేవి

తెప్పోత్సవంతో ముగింపు

ఉత్సవాల చివరి రోజైన అక్టోబర్ 2న అమ్మవారి రాజరాజేశ్వరీ అలంకరణతో పాటు సాయంత్రం తెప్పోత్సవంను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలు, శానిటేషన్, పాసు సిస్టంలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

— ఈదిన భక్తుల కోలాహలం మధ్య దుర్గమ్మ దర్శనం అపూర్వ అనుభూతిని అందించనుంది.

Blogger ఆధారితం.