దివ్య దేశ్‌ముఖ్ విజయం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన
హైదరాబాద్, అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అద్భుత విజయాన్ని సాధించి గ్రాండ్‌మాస్టర్‌గా అరుదైన ఘనతను అందుకున్న దివ్య దేశ్‌ముఖ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ని ఫైనల్ పోరులో మట్టికరిపించి టైటిల్ సొంతం చేసుకున్న దివ్య దేశ్‌ముఖ్ ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు.
"ఒకే టోర్నమెంట్‌లో ఇద్దరు భారతీయ మహిళా గ్రాండ్‌మాస్టర్లు ఫైనల్స్‌కు చేరడం దేశానికి గర్వకారణం. వీరిద్దరూ ప్రపంచ స్థాయి దిగ్గజులతో పోటీపడి సెమీఫైనల్స్ దాటి, అత్యున్నత మঞ্চమైన ఫైనల్‌కు చేరుకోవడం భారత క్రీడా రంగానికి కొత్త గర్వకారక అధ్యాయం" అని సీఎం అన్నారు.
మహిళలకు సరైన అవకాశాలు లభిస్తే వారు ప్రపంచాన్ని కూడా జయించగలరన్న దానికి దివ్య దేశ్‌ముఖ్ మరియు కోనేరు హంపి లు అత్యుత్తమ ఉదాహరణలు అని పేర్కొన్నారు.
ఫిడే మహిళా చెస్ ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ భారత క్రీడాకారిణీ సెమీఫైనల్స్ దాటి ఫైనల్స్‌కు చేరలేదని, ఈ ఏడాది మాత్రం ఇద్దరు భారతీయులే ఫైనల్ వరకు పోటీపడటం అత్యంత ప్రశంసనీయమైన విషయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వీరిద్దరూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని, దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా మరింత పెంచాలని ఆకాంక్షించారు.
Post a Comment