-->

బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలి – రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతికి విజ్ఞప్తి

బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలి – రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతికి విజ్ఞప్తి


హైదరాబాద్‌, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాల్సిందిగా గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతిని కోరేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి వచ్చే ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.

గత మార్చి నెలలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఈ బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో, ఎన్నికల హైకోర్టు గడువు నేపథ్యంలో రాష్ట్రం తక్షణ నిర్ణయాల దశకు చేరుకుంది.

ఈ అంశాన్ని మీడియాతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి వెల్లడించారు. బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉందని, ఈ ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలూ ప్రభుత్వానికి మద్ధతివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.