-->

పర్యావరణ పరిరక్షణకు ముందుండాలి… మొక్కలు నాటాలి!

 

సెంటినరీ కాలనీలో మొక్కలు నాటిన ఎస్ఐఓ చిన్నారులు


గోదావరిఖని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని, మొక్కలు నాటి ప్రకృతి ప్రేమను చాటాలని కోరుతూ, సెంటినరీ కాలనీలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా CIO చేపట్టిన పర్యావరణ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం ఆకర్షణీయంగా కొనసాగింది.

ఈ సందర్భంగా CIO ఉద్యమ కన్వీనర్లు ఐషా సిద్దిఖా, సబీరా నాజ్ మాట్లాడుతూ – ‘‘పర్యావరణం మన అందరి బాధ్యత. చిన్నప్పటినుంచే పిల్లల్లో ఈ అవగాహన పెంచాలి. మొక్కలు నాటటం ద్వారా భవిష్యత్‌కు ఆరోగ్యకరమైన వాతావరణం అందించొచ్చు,’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ గోదావరిఖని మహిళా విభాగం అధ్యక్షురాలు, అబుజార్, సూఫియాన్, ఖలీదా, మౌలానా యాసర్, సీఐఓ చిన్నారులు, మదర్సా తజ్వీదుల్ ఖురాన్ విద్యార్థులు, అల్కౌసర్ మసీదు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను స్వయంగా తీసుకుంటామని పిల్లలు హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.