భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్, నగరంలోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతోన్న ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మియాపూర్‌లోని జనప్రియా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే హన్సిక (15) అనే బాలిక, ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
బుధవారం ఉదయం హన్సిక అపార్ట్‌మెంట్ భవనం పై నుండి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికుల మధ్య విషాదచాయలు అలముకున్నాయి.
Post a Comment