-->

సిద్దాపూర్ కాలనీ వాసులకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్

సిద్దాపూర్ కాలనీ వాసులకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్


సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వాసులకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ, సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్ మాట్లాడుతూ, గతంలో అనేకసార్లు అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పట్టాల మంజూరులో పురోగతిలేదన్నారు. "బిఆర్ఎస్ హయాంలో ఈ సమస్యను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. కనీసం ఇప్పుడు పూరి గుడిసెలు వేసుకొని జీవనాన్ని సాగిస్తున్న వారికీ స్థలపు హక్కులు కల్పించాలి" అని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం ఆర్ఐ అనంతయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నేతలు షఫీ, ఎం.ఏ. రెహమాన్, మండల కార్యదర్శి పాండు, అనసూయ, బికెఎమ్మ్యూలో కార్యదర్శి తూమ్మపూడి బుజ్జమ్మ, సిపిఐ నాయకులు రజిని, సరస్వతి, గంగమ్మ, శివ, లీల, పూలమ్మ, దేవి, బిపాషా, యాకుబ్ ఆలి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.