సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు
నారాయణఖేడ్ డివిజన్‌కు ఇటీవలే సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐ.ఏ.ఎస్. అధికారిణి ఎన్. ఉమాహారతి గారిని ఎంఐఎం పార్టీ నారాయణఖేడ్ అధ్యక్షుడు న్యాయవాది మోహీద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా మోహీద్ పటేల్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యతనిచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ భేటీకి ఎంఐఎం నాయకులు అబ్దుల్ జబ్బార్, చంద్ పాషా, షేక్ అంజెడ్, ముజీబ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.
Post a Comment