-->

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనంతో పాటు అభివృద్ధి పథకాలకు శ్రీకారం

  

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనంతో పాటు అభివృద్ధి పథకాలకు శ్రీకారం

తాడ్వాయి, తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ మేడారం గ్రామంలో వనదేవతలు శ్రీ సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించిన అనంతరం ఆమె జాతర ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో 2026 మేడారం మహా జాతర ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “తెలంగాణ గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.

2026లో జరగనున్న మహా జాతరకు దృష్టిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆమె తెలిపారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్, రహదారి మరమ్మతులు, బస ఏర్పాట్లపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు.

అనంతరం తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.