అబిడ్స్‌లోని ఓ పబ్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 33 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం
హైదరాబాద్, నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అబిడ్స్‌లోని ఓ పబ్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 33 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా, ఈ మత్తుపదార్థాలను బెంగళూరులో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రాము రూ.9 వేల ధరకు డ్రగ్స్‌ను తెచ్చుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో మిస్బా ఉద్దీన్, అలీ అస్గర్, జుబేర్ అలీ అనే ముగ్గురు యువకులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Post a Comment