79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దిశ జిల్లా అధ్యక్షులు పూజల లక్ష్మి జెండా ఎగురవేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి ప్రధాన అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడిన పూజల లక్ష్మి, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరజవాన్ల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని అన్నారు. యువత దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, అశాంతి, అసమానతలు, అవినీతి లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో గుమలాపురం సత్యనారాయణ, దిశా సభ్యులు పూజల లక్ష్మి, కందుల సుజాత, శారద, దివ్య, రజిత, వై.కమల, స్రవంతి, బాణాల దివ్యమ్మ, జయమ్మ, సువర్ణ కుమారి, స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Post a Comment