-->

రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి – బంగారు ఆభరణాల చోరీ

రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి – బంగారు ఆభరణాల చోరీ


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై బుధవారం అర్ధరాత్రి దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా నివాసి కృష్ణారెడ్డి కుటుంబం, ముంబైలో స్థిరపడి జీవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై, తిరుగు ప్రయాణంలో స్నేహితుడు వెంకటేశం దంపతులతో కలిసి కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలో బూచనెల్లి సమీపంలోని ఒక పెట్రోల్ బంకు వద్ద కారు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, అర్ధరాత్రి తర్వాత ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి భార్య మెడలోని రెండు తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. దాడిలో కృష్ణారెడ్డికి గాయాలయ్యాయి.

ఘటనపై చిరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.