ఓటర్ల జాబితా అక్రమాలకు నిరసనగా ఖమ్మంలో కొవ్వొత్తుల ర్యాలీ
ఖమ్మం: ఓటర్ల జాబితాలో అక్రమాలను, ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడులను ఖండిస్తూ ఖమ్మంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ—
"ఓటర్ల జాబితాలోని లోపాలను బయటపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాహుల్ గాంధీపై పోలీసులు నమోదు చేసిన కేసులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్నికల కమిషన్ పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలి" అని అన్నారు.
అలాగే, “మన ఓటు హక్కును కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి పౌరుడు ఐక్యంగా నిలబడాలి” అని పిలుపునిచ్చారు.
Post a Comment