భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక – పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గాలి ఆవర్తనం, దానివల్ల ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ (గురువారం) వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో:
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీటి మునకలు, రహదారి రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు.
తెలంగాణలో:
మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
వర్షాల సమయంలో నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదని, వర్షపు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళలలో రహదారులపై ప్రయాణం తగ్గించాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
అధికారుల సిద్ధం:
అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది..

Post a Comment