-->

బస్సు ఆపలేదని మహిళా కండక్టర్‌పై దాడి

బస్సు ఆపలేదని మహిళా కండక్టర్‌పై దాడి


హైదరాబాద్‌: తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన తరువాత ఆర్టీసీ సిబ్బందిపై దాడుల సంఘటనలు పెరుగుతున్నాయి. సీటు దొరకకపోవడం, బస్సు ఆపకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, ఫలక్నుమా నుండి సికింద్రాబాద్‌ వెళ్తున్న బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు, మహిళా కండక్టర్‌పై దాడి చేసింది. తన గమ్యస్థానంలో బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరిన ఆమెకు, “ఎక్కడ పడితే అక్కడ ఆపలేం” అని సమాధానం రావడంతో ఆగ్రహించిన ప్రయాణికురాలు డ్రైవర్‌తో పాటు కండక్టర్‌పై బూతుపురాణం అందుకుంది. అంతేకాకుండా, మహిళా కండక్టర్‌ పీక పట్టుకుని తోసిపారేసేలా ప్రవర్తించింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. ఈ తరహా ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793