ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌కర్ పదవీ కాలం పూర్తి అవుతుండగా, కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికకు ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఎన్నికల కమిషన్ ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న (2025) జరగనున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికలు పూర్తయ్యిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాలు కూడా వెంటనే ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు.
నామినేషన్లకు కీలక తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 7
- నామినేషన్ల దాఖలుకు గడువు: ఆగస్టు 21
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఆగస్టు 25
ఈ ఎన్నికల్లో ఎంపీలు మాత్రమే ఓటు వేయగలగటం విశేషం. రహస్య ఓటింగ్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభకు అధ్యక్షులుగా పని చేసే ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగపరంగా విశిష్ట ప్రాధాన్యం కలిగి ఉంది.
Post a Comment