-->

కొత్తగూడెం బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదుల చేత కలెక్టర్, సబ్ కలెక్టర్‌లకు రాఖీ

కొత్తగూడెం బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదుల చేత కలెక్టర్, సబ్ కలెక్టర్‌లకు రాఖీ


రక్షాబంధన్ పర్వదినం సందర్బంగా, కొత్తగూడెం బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాదులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కి మరియు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ  లకు సోదరభావంతో రాఖీ కట్టారు.

కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ న్యాయవాది, జూనియర్ మహిళా న్యాయవాదులు ఆర్తి మక్కడ్, నకరికంటి ఉమా, యాస మౌనిక, అరుణలత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళా న్యాయవాదులు, రక్షాబంధన్ పండుగ సారాంశం — సోదరుడు తన సోదరిని రక్షిస్తాడనే ఆత్మీయ బంధాన్ని — కలెక్టర్, సబ్ కలెక్టర్‌లతో పంచుకున్నారు. ఈ సందర్భంలో అధికారులు సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మహిళల భద్రత, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793