వ్యభిచార ముఠా బహిర్గతం – 9 నిర్వాహకులు, 4 విటులు అదుపులో
కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ఇంట్లో నెలలుగా నడుస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు గురువారం రాత్రి దాడి చేసి ముఠాను బహిర్గతం చేశారు. ఈ దాడిలో 9 మంది నిర్వాహకులు, 4 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ, అనంతపురం, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారంలో నెట్టేస్తూ, వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యాపారంలో వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు పంచుకునేవారని పోలీసులు తెలిపారు.
అరెస్టైన నిర్వాహకులు – కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల బనగానపల్లెకు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన అన్యం నారాయణమ్మ.
విటులుగా పట్టుబడ్డవారు – కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్.
ఇంటి యజమానులు అద్దెకు ఇల్లు ఇవ్వేముందు కిరాయిదారుల వివరాలు సరిచూసుకోవాలని, ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు కనిపిస్తే డయల్ 112 లేదా 91211 01062 కు సమాచారం ఇవ్వాలని నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహా విజ్ఞప్తి చేశారు.

Post a Comment