-->

శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం

శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం


పీరజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పరవాతపూర్‌లో ఈ రోజు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంలో మేడ్చల్ నియోజకవర్గ బి-బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పీరజాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్, వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సాంప్రదాయ కళా ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793