గుర్తు తెలియని వ్యక్తులు తల్లి, కూతుర్లపై దాడి చేసి హత్య
జనగామ జిల్లా… జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ)లో దారుణం
జనగామ జిల్లాలోని జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లి, కూతుర్లపై దాడి చేసి హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మృతులు గాలి రాణి (50), తుమ్మ అండమ్మ (83)గా గుర్తించారు.
హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Post a Comment