పరిగి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటిన నేతలు
పరిగి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ప్రారంభమైన జనహిత పాదయాత్ర మొదటి రోజున పరిగిలో శుభారంభం అయింది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తదితరులు పరిగి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
పాదయాత్రకు విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు భారీగా స్పందించగా, పర్యావరణ పరిరక్షణపై నేతలు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక వర్గాల నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కట్టుబడ చేయడమే లక్ష్యంగా టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Post a Comment