ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ దంపతులకు ఘన సన్మానం
రామగుండం: టెమ్రీస్ రామగుండం-బయాస్-1లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టెమ్రీస్ కౌన్సిలర్లు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, ఐషా సిద్దిఖా (వైస్ ప్రెసిడెంట్, జాతీయ కార్మిక నేత) దంపతులను ఆహ్వానించి కమిటీ నాయకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ జెండా ఆవిష్కరించి గౌరవ అతిథులుగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మా పాఠశాలకు తల్లిదండ్రుల కౌన్సిలింగ్, విద్యార్థుల కౌన్సిలింగ్, సిబ్బంది కౌన్సిలింగ్ వంటి సేవలను ఎల్లప్పుడూ అందిస్తూ ఉన్న కౌన్సిలర్లకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపామన్నారు.
ఈ సందర్భంగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ దంపతులకు బొకేలు, జ్ఞాపికలు అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్, మైనార్టీ నాయకుడు అబ్దుల్ సత్తార్, జమాత్-ఇ-ఇస్లామీ హింద్ గోదావరిఖని నాయకుడు ముస్తఫా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post a Comment