-->

క్లౌడ్‌బరెస్ట్‌ మృతి సంఖ్య 46కు పెరిగింది చోసిటీలో విపత్తు – శిథిలాల కింద ఇంకా పలువురు (వీడియో)

క్లౌడ్‌బరెస్ట్‌ మృతి సంఖ్య 46కు పెరిగింది చోసిటీలో విపత్తు – శిథిలాల కింద ఇంకా పలువురు (వీడియో)


జమ్మూకశ్మీర్‌లోని చోసిటీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న క్లౌడ్‌బరెస్ట్‌ విలయం సృష్టించింది. క్షణాల్లో కురిసిన భారీ వర్షానికి తోడు మెరుపువేగంతో వచ్చిన వరదలతో గ్రామాలు ముంచెత్తాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు అందకపోవడంతో ప్రజలు అప్రమత్తం కావడానికి అవకాశం లేకుండా పోయింది.



అధికారుల సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు 46 మృతదేహాలు వెలికితీయబడ్డాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నారని భావిస్తున్నారు. రక్షణ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

ఇప్పటివరకు 160 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వారిలో 38 మందికి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా వర్షం కొనసాగుతుండటంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఈ విపత్తు కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. పునరావాస చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది.

Blogger ఆధారితం.