-->

వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (వీడియో)

వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (వీడియో)


న్యూడిల్లి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచే దృశ్యం ఢిల్లీలో వెలిసింది. ఆగస్టు 15న ఉదయం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, త్రివిధ దళాధిపతులు కలిసి నివాళులర్పించారు.


కార్యక్రమం జరుగుతుండగా ఢిల్లీలో జోరుగా వర్షం కురుస్తోంది. అయినప్పటికీ, రాష్ట్రపతి, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు. గొడుగులు లేకుండా, వర్షపు జల్లు తగులుతున్నా, గౌరవ వందనాలతో, సైనిక మర్యాదలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోను చూసిన నెటిజన్లు, "చూసిన వెంటనే గూస్‌బంప్స్ వచ్చాయి", "ఇదే నిజమైన దేశభక్తి" అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భాల్లో దేశానికి ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి వర్షంలో తడుస్తూ నివాళులర్పించడం ఆ క్షణానికి మరింత గౌరవాన్ని, గంభీరతను చేర్చింది.

Blogger ఆధారితం.