ఘోర రోడ్డు ప్రమాదం లారీ బస్సును ఢీ 20 మందికి పైగా గాయాలు
వరంగల్ : రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును, తొర్రూరు నుండి వరంగల్‌కు వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీ ప్రభావంతో బస్సు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో అక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలంలో రాకపోకలు అంతరాయం కలగడంతో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment