పాల్వంచ టౌన్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పాల్వంచ టౌన్: 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ, తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాయని తెలిపారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాలు, యూత్ కాంగ్రెస్, NSUI, INTUC నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
Post a Comment