-->

డెకరేషన్ లైట్ల వైర్లు తగిలి కరెంట్ షాక్‌తో 8 ఏళ్ల బాలిక మృతి

డెకరేషన్ లైట్ల వైర్లు తగిలి కరెంట్ షాక్‌తో 8 ఏళ్ల బాలిక మృతి


హైదరాబాద్, అక్టోబర్ 7: నూతన గృహప్రవేశ వేడుక ఆనందాన్ని విషాదంలోకి నెట్టేసిన ఘటన అమీర్‌పేట్ పరిధిలోని సనత్‌నగర్ ఉదయ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన శ్రీరాములు కుటుంబంలో గృహప్రవేశ వేడుక జరుగుతుండగా, ఆయన కూతురు మేఘన (8) బిల్డింగ్ పైభాగంలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదం జరిగింది.

డెకరేషన్ కోసం అమర్చిన ఎలక్ట్రిక్ లైట్ల వైర్లు తగిలి మేఘన కరెంట్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని తెలిపారు.

ఈ ఘటనతో గృహప్రవేశ వేడుక వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793