హైదరాబాద్‌లో భారీ వర్షం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు నగరం స్తంభన!
హైదరాబాద్: అక్టోబర్ 07: రాజధానిలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, అసెంబ్లీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోతగా వాన కురవడంతో నగర జీవనం స్తంభించిపోయింది.
రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లిలో ప్రధాన రహదారులపై నీరు నిల్వ ఉండటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు అటకాయడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమయ్యారు.
ముఖ్యంగా అబిడ్స్ నుండి అసెంబ్లీ వరకు రహదారి జలమయం అయింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, నగరంలో రాత్రివేళల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
Post a Comment