🌧️ ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వార్నింగ్!!
హైదరాబాద్, అక్టోబర్ 29: మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
🔴 ఐఎండీ రెడ్ అలర్ట్ (భారీ నుంచి అతి భారీ వర్షాలు) జారీ చేసిన జిల్లాలు:
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల
🟡 ఎల్లో అలర్ట్ (భారీ, మోస్తరు వర్షాలు) ఉన్న జిల్లాలు:
జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్
వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. తక్కువ ప్రదేశాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Post a Comment