కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం – బట్టల షాపుతో పాటు పలు దుకాణాలు దగ్ధం!
కరీంనగర్ : అక్టోబర్ 29: కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ‘కపిల డ్రస్సెస్’ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న పలు దుకాణాలను చుట్టుముట్టాయి.
ఈ ప్రమాదంలో కపిల డ్రస్సెస్, వినాయక ఎంటర్‌ప్రైజెస్, ఫోటోగ్రఫీ షాపు, కెనాన్ ఫోటోగ్రఫీ దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, షాప్‌లు తెరవకముందే మంటలు ఎగసిపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆస్తి నష్టం కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. పోలీసు, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment